Categories
ఆంధ్రప్రదేశ్ తాజా వార్తలు

ఆత్రేయపురం మండలం, వాడపల్లి శ్రీ వేంకటేశ్వరస్వామి వారి

ఆత్రేయపురం మండలం, వాడపల్లి శ్రీ వేంకటేశ్వరస్వామి వారి ఆలయంలో జరుగుతున్న పవిత్రోత్సవాలు ద్వితీయ దినానికి చేరాయి. ఉత్సవాల సందర్భంగా శనివారం స్వామివారికి అర్చకులు ఘనంగా ‘మహాస్నపనం’ కార్యక్రమాన్ని నిర్వహించారు. వేద మంత్రోచ్ఛారణలు, మంగళ వాయిద్యాల నడుమ మూలవిరాట్‌తో పాటు ఉత్సవమూర్తులకు నదీజలాలు, పంచామృతాలు, సుగంధ ద్రవ్యాలతో ఈ విశేష అభిషేకాన్ని భక్తిశ్రద్ధలతో పూర్తి చేశారు. ఈ దివ్య ఘట్టాన్ని దర్శించుకోవడానికి భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి తరలివచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *