Friday, 16 October 2026
🔴 బ్రేకింగ్ న్యూస్
• అవినీతి విచారణ వివరాలను RTI కింద పూర్తిగా నిరాకరించలేరు: మద్రాస్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు • ప్రజాస్వామ్యానికి RTI చట్టం జీవనాడి: తెలంగాణ గవర్నర్ శివ ప్రతాప్ శుక్ల • RTIకి స్పందించని PIOకు రూ.20 వేల జరిమానా • RTI సమాచారంలో జాప్యం: మంచిర్యాల DEO, 18 మంది MEOలకు సమాచార కమిషన్ నోటీసులు • ఆర్టీఐ సమాచారంలో 5 ఏళ్లకు పైగా జాప్యం.. ఫరీదాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ ₹10 వేల పరిహారం చెల్లించాలని ఆదేశం • కర్ణాటక హైకోర్టు కీలక ఆదేశాలు.. RTI అధికారులపై జరిమానాల వివరాలు ఆన్‌లైన్‌లో పెట్టాలి • తమిళనాడులో RTI మినహాయింపు ఉత్తర్వు ఉపసంహరణ • అవినీతి విచారణ వివరాలను RTI కింద పూర్తిగా నిరాకరించలేరు: మద్రాస్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు • ప్రజాస్వామ్యానికి RTI చట్టం జీవనాడి: తెలంగాణ గవర్నర్ శివ ప్రతాప్ శుక్ల • RTIకి స్పందించని PIOకు రూ.20 వేల జరిమానా • RTI సమాచారంలో జాప్యం: మంచిర్యాల DEO, 18 మంది MEOలకు సమాచార కమిషన్ నోటీసులు • ఆర్టీఐ సమాచారంలో 5 ఏళ్లకు పైగా జాప్యం.. ఫరీదాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ ₹10 వేల పరిహారం చెల్లించాలని ఆదేశం • కర్ణాటక హైకోర్టు కీలక ఆదేశాలు.. RTI అధికారులపై జరిమానాల వివరాలు ఆన్‌లైన్‌లో పెట్టాలి • తమిళనాడులో RTI మినహాయింపు ఉత్తర్వు ఉపసంహరణ

కెరీర్ తొలినాళ్లలో గర్వం ఉండేది.. ఎవరినీ లెక్క చేసేదాన్ని కాదు: నమిత

30 Aug 2026 · సినిమా
కెరీర్ తొలినాళ్లలో గర్వం ఉండేది.. ఎవరినీ లెక్క చేసేదాన్ని కాదు: నమిత
కెరీర్ తొలినాళ్లలో వరుస సినిమాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటి నమిత (Namitha). అయితే అప్పట్లో తనకు వచ్చిన విజయాలు, మీడియా ఇచ్చిన ప్రాధాన్యం కారణంగా తన ప్రవర్తనలో మార్పు వచ్చిందని ఆమె తెలిపారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న నమిత తన కెరీర్‌కు సంబంధించిన ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.
“నటిగా కెరీర్‌ను ప్రారంభించిన తొలిరోజుల్లో నాలో గర్వం ఉండేది. ఎవరినీ లెక్క చేసేదాన్ని కాదు. ఈ విషయంలో చాలా మంది నన్ను హెచ్చరించారు. ‘నువ్వు ఇలాంటి వైఖరిని కొనసాగిస్తే ఇండస్ట్రీలో ఎక్కువ రోజులు ఉండలేవు’ అని కొందరు చెప్పారు. దీంతో నెమ్మదిగా నాలో మార్పు మొదలైంది. నా ప్రవర్తన కారణంగా సహనటులు, టెక్నీషియన్లు చాలా ఇబ్బంది పడ్డారు. ఒకరిద్దరు కాదు.. చాలా మంది ఈ విషయాన్ని నాకు చెప్పారు” అని నమిత చెప్పుకొచ్చారు.
కెరీర్‌లో మంచి గుర్తింపు
17 ఏళ్ల వయసులో మిస్ సూరత్‌గా ఎంపికైన నమిత.. ఆ తర్వాత మిస్ ఇండియా పోటీల్లో పాల్గొన్నారు. అనంతరం సినిమాల్లోకి అడుగుపెట్టి తెలుగు, తమిళ చిత్రాల్లో నటించారు. తెలుగులో ‘సొంతం’ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. 2004–09 మధ్య స్టార్ హీరోయిన్‌గా ఒక వెలుగు వెలిగారు. ఆ తర్వాత అవకాశాలు క్రమంగా తగ్గాయి. 2017లో తమిళ బిగ్‌బాస్ రియాలిటీ షోలో పాల్గొన్నారు. అనంతరం రాజకీయాల్లోనూ అడుగుపెట్టారు.
షేర్ చేయండి