Friday, 16 October 2026
🔴 బ్రేకింగ్ న్యూస్
• అవినీతి విచారణ వివరాలను RTI కింద పూర్తిగా నిరాకరించలేరు: మద్రాస్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు • ప్రజాస్వామ్యానికి RTI చట్టం జీవనాడి: తెలంగాణ గవర్నర్ శివ ప్రతాప్ శుక్ల • RTIకి స్పందించని PIOకు రూ.20 వేల జరిమానా • RTI సమాచారంలో జాప్యం: మంచిర్యాల DEO, 18 మంది MEOలకు సమాచార కమిషన్ నోటీసులు • ఆర్టీఐ సమాచారంలో 5 ఏళ్లకు పైగా జాప్యం.. ఫరీదాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ ₹10 వేల పరిహారం చెల్లించాలని ఆదేశం • కర్ణాటక హైకోర్టు కీలక ఆదేశాలు.. RTI అధికారులపై జరిమానాల వివరాలు ఆన్‌లైన్‌లో పెట్టాలి • తమిళనాడులో RTI మినహాయింపు ఉత్తర్వు ఉపసంహరణ • అవినీతి విచారణ వివరాలను RTI కింద పూర్తిగా నిరాకరించలేరు: మద్రాస్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు • ప్రజాస్వామ్యానికి RTI చట్టం జీవనాడి: తెలంగాణ గవర్నర్ శివ ప్రతాప్ శుక్ల • RTIకి స్పందించని PIOకు రూ.20 వేల జరిమానా • RTI సమాచారంలో జాప్యం: మంచిర్యాల DEO, 18 మంది MEOలకు సమాచార కమిషన్ నోటీసులు • ఆర్టీఐ సమాచారంలో 5 ఏళ్లకు పైగా జాప్యం.. ఫరీదాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ ₹10 వేల పరిహారం చెల్లించాలని ఆదేశం • కర్ణాటక హైకోర్టు కీలక ఆదేశాలు.. RTI అధికారులపై జరిమానాల వివరాలు ఆన్‌లైన్‌లో పెట్టాలి • తమిళనాడులో RTI మినహాయింపు ఉత్తర్వు ఉపసంహరణ

ప్రశ్నల రూపంలో ఉన్నా RTI సమాచారాన్ని ఇవ్వాల్సిందే

ప్రశ్నల రూపంలో ఉన్నా RTI సమాచారాన్ని ఇవ్వాల్సిందే

అమరావతి, సెప్టెంబర్ 27 (సమాచార హక్కు) : సమాచార హక్కు చట్టం (RTI) కింద దరఖాస్తు చేసుకునే సమయంలో ప్రశ్నల రూపంలో వివరాలు అడిగినంత మాత్రాన సమాచారాన్ని నిరాకరించకూడదని ఆంధ్రప్రదేశ్ సమాచార కమిషన్ స్పష్టం చేసింది. దరఖాస్తులో నిర్దిష్ట అంశాలు, వివరాలు ఉంటే సంబంధిత రికార్డుల ఆధారంగా సమాచారం అందించాలని ఆదేశించింది.

చిత్తూరు జిల్లా యాదమరి మండలం కాశీరాళ్ల గ్రామానికి చెందిన టి. దేవదాసు భూములకు సంబంధించిన వివరాల కోసం తహసీల్దార్ కార్యాలయానికి RTI దరఖాస్తు చేసుకున్నారు. నిర్దిష్ట సర్వే నంబర్లను పేర్కొంటూ భూములకు సంబంధించిన సమాచారాన్ని కోరారు.

అయితే అధికారులు సమాచారం ఇవ్వకపోవడంతో ఆయన అప్పీల్‌కు వెళ్లారు. విషయం రాష్ట్ర సమాచార కమిషన్‌ వరకు వెళ్లింది. కేసును సమాచార కమిషనర్ చక్రవర్తి విచారించారు.

దరఖాస్తు ప్రశ్నల రూపంలో ఉందనే కారణంతో సమాచారం ఇవ్వలేమన్న అధికారుల వాదనను కమిషన్ అంగీకరించలేదు. దరఖాస్తులో కొన్ని లోపాలు ఉన్నప్పటికీ, కోరిన సమాచారం ప్రభుత్వ రికార్డుల్లో అందుబాటులో ఉంటే దానిని దరఖాస్తుదారుడికి అందించాలని ఆదేశించింది.

ఇదే సమయంలో సమాచారం కోరినందుకు అధికారులు తనను బెదిరిస్తున్నారని దరఖాస్తుదారు కమిషన్‌ దృష్టికి తీసుకువచ్చారు. ఈ ఆరోపణలపై విచారణ జరిపి నివేదిక సమర్పించాలని చిత్తూరు జిల్లా కలెక్టర్‌ను కమిషన్ ఆదేశించింది.

షేర్ చేయండి