Friday, 16 October 2026
🔴 బ్రేకింగ్ న్యూస్
• అవినీతి విచారణ వివరాలను RTI కింద పూర్తిగా నిరాకరించలేరు: మద్రాస్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు • ప్రజాస్వామ్యానికి RTI చట్టం జీవనాడి: తెలంగాణ గవర్నర్ శివ ప్రతాప్ శుక్ల • RTIకి స్పందించని PIOకు రూ.20 వేల జరిమానా • RTI సమాచారంలో జాప్యం: మంచిర్యాల DEO, 18 మంది MEOలకు సమాచార కమిషన్ నోటీసులు • ఆర్టీఐ సమాచారంలో 5 ఏళ్లకు పైగా జాప్యం.. ఫరీదాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ ₹10 వేల పరిహారం చెల్లించాలని ఆదేశం • కర్ణాటక హైకోర్టు కీలక ఆదేశాలు.. RTI అధికారులపై జరిమానాల వివరాలు ఆన్‌లైన్‌లో పెట్టాలి • తమిళనాడులో RTI మినహాయింపు ఉత్తర్వు ఉపసంహరణ • అవినీతి విచారణ వివరాలను RTI కింద పూర్తిగా నిరాకరించలేరు: మద్రాస్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు • ప్రజాస్వామ్యానికి RTI చట్టం జీవనాడి: తెలంగాణ గవర్నర్ శివ ప్రతాప్ శుక్ల • RTIకి స్పందించని PIOకు రూ.20 వేల జరిమానా • RTI సమాచారంలో జాప్యం: మంచిర్యాల DEO, 18 మంది MEOలకు సమాచార కమిషన్ నోటీసులు • ఆర్టీఐ సమాచారంలో 5 ఏళ్లకు పైగా జాప్యం.. ఫరీదాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ ₹10 వేల పరిహారం చెల్లించాలని ఆదేశం • కర్ణాటక హైకోర్టు కీలక ఆదేశాలు.. RTI అధికారులపై జరిమానాల వివరాలు ఆన్‌లైన్‌లో పెట్టాలి • తమిళనాడులో RTI మినహాయింపు ఉత్తర్వు ఉపసంహరణ

ప్రకాశ్ రాజ్‌కు నిరసన సెగ

31 Aug 2026 · సినిమా
ప్రకాశ్ రాజ్‌కు నిరసన సెగ
ధార్వాడ: కర్ణాటక విద్యార్థుల సంఘం 50వ వార్షికోత్సవ ముగింపు సభలో బహుభాషా నటుడు ప్రకాశ్ రాజ్ పాల్గొనడం ఉద్రిక్తతకు దారితీసింది. ఆయన రాకను వ్యతిరేకిస్తూ కొందరు నిరసనకు దిగగా.. ప్రకాశ్ రాజ్‌కు మద్దతుగా మరో వర్గం నినాదాలు చేయడంతో సభా ప్రాంగణంలో కొంతసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
బీజేపీకి చెందిన సవితా అమరశెట్టి, రాహుల్ మల్లిగవాడ నేతృత్వంలో వచ్చిన ప్రతినిధులు ‘గో బ్యాక్ ప్రకాశ్ రాజ్’ అంటూ నినాదాలు చేశారు. దీనికి ప్రతిగా ప్రకాశ్ రాజ్ మద్దతుదారులు ‘ప్రకాశ్ రాజ్‌కు స్వాగతం’ అంటూ నినదించారు. దీంతో ఇరువర్గాల మధ్య కొంతసేపు వాగ్వాదం చోటుచేసుకుంది.
పరిస్థితి అదుపు తప్పకుండా పోలీసులు వెంటనే రంగంలోకి దిగారు. నిరసనకారులను అదుపులోకి తీసుకుని అక్కడి నుంచి తరలించారు. ఇదే సమయంలో విద్యార్థుల సంఘం కార్యాలయం ముందు ఏర్పాటు చేసిన ప్రకాశ్ రాజ్ బ్యానర్‌కు కొందరు మసి పూసి చించివేసినట్లు సమాచారం.
కార్యక్రమం ముగిసిన అనంతరం కూడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. అనంతరం ప్రకాశ్ రాజ్‌ను పోలీసుల భద్రత మధ్య అక్కడి నుంచి తరలించారు.
షేర్ చేయండి