Friday, 16 October 2026
🔴 బ్రేకింగ్ న్యూస్
• అవినీతి విచారణ వివరాలను RTI కింద పూర్తిగా నిరాకరించలేరు: మద్రాస్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు • ప్రజాస్వామ్యానికి RTI చట్టం జీవనాడి: తెలంగాణ గవర్నర్ శివ ప్రతాప్ శుక్ల • RTIకి స్పందించని PIOకు రూ.20 వేల జరిమానా • RTI సమాచారంలో జాప్యం: మంచిర్యాల DEO, 18 మంది MEOలకు సమాచార కమిషన్ నోటీసులు • ఆర్టీఐ సమాచారంలో 5 ఏళ్లకు పైగా జాప్యం.. ఫరీదాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ ₹10 వేల పరిహారం చెల్లించాలని ఆదేశం • కర్ణాటక హైకోర్టు కీలక ఆదేశాలు.. RTI అధికారులపై జరిమానాల వివరాలు ఆన్‌లైన్‌లో పెట్టాలి • తమిళనాడులో RTI మినహాయింపు ఉత్తర్వు ఉపసంహరణ • అవినీతి విచారణ వివరాలను RTI కింద పూర్తిగా నిరాకరించలేరు: మద్రాస్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు • ప్రజాస్వామ్యానికి RTI చట్టం జీవనాడి: తెలంగాణ గవర్నర్ శివ ప్రతాప్ శుక్ల • RTIకి స్పందించని PIOకు రూ.20 వేల జరిమానా • RTI సమాచారంలో జాప్యం: మంచిర్యాల DEO, 18 మంది MEOలకు సమాచార కమిషన్ నోటీసులు • ఆర్టీఐ సమాచారంలో 5 ఏళ్లకు పైగా జాప్యం.. ఫరీదాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ ₹10 వేల పరిహారం చెల్లించాలని ఆదేశం • కర్ణాటక హైకోర్టు కీలక ఆదేశాలు.. RTI అధికారులపై జరిమానాల వివరాలు ఆన్‌లైన్‌లో పెట్టాలి • తమిళనాడులో RTI మినహాయింపు ఉత్తర్వు ఉపసంహరణ

గణేష్ మండపాల నిర్వాహకులకు పోలీసుల కీలక సూచనలు

గణేష్ మండపాల నిర్వాహకులకు పోలీసుల కీలక సూచనలు
బాలానగర్, సెప్టెంబర్ 7 (సమాచార హక్కు): వినాయక చవితి ఉత్సవాలను ప్రశాంతంగా, క్రమబద్ధంగా నిర్వహించేందుకు బాలానగర్ పోలీస్ స్టేషన్‌లో గణేష్ మండపాల నిర్వాహకులతో శాంతి కమిటీ సమావేశం నిర్వహించారు. ఏసీపీ నరేష్ రెడ్డి, సీఐ ప్రశాంత్‌తో పాటు పోలీసు అధికారులు, ఉత్సవ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
మండపాల నిర్వాహకులు ముందస్తుగా పోలీసులకు సమాచారం అందించి, కమిటీ సభ్యుల వివరాలు సమర్పించాలని పోలీసులు సూచించారు. మండపాల వద్ద సురక్షిత విద్యుత్ కనెక్షన్లు, అగ్నిమాపక పరికరాలు, CCTV కెమెరాలు ఏర్పాటు చేయాలని తెలిపారు. మహిళలు, చిన్నారులు, వృద్ధుల భద్రతకు ప్రత్యేక ప్రాధాన్యం ఇవ్వాలని, ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా చూడాలని స్పష్టం చేశారు.
లౌడ్‌స్పీకర్లను అనుమతించిన సమయాల్లో మాత్రమే వినియోగించాలని, మండపాల వద్ద మద్యం, మత్తు పదార్థాలు, ఆయుధాలకు అనుమతి లేదని పోలీసులు హెచ్చరించారు. సోషల్ మీడియాలో తప్పుడు వార్తలు, వదంతులు ప్రచారం చేయకూడదని సూచించారు.
నిమజ్జన ఊరేగింపును పోలీసులు సూచించిన మార్గంలో, నిర్ణయించిన సమయానికే నిర్వహించాలని తెలిపారు. హైకోర్టు ఆదేశాల మేరకు DJ, Pad Band వినియోగం నిషేధించబడిందని, నిబంధనలు ఉల్లంఘిస్తే నిర్వాహకులు, సంబంధిత యజమానులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
అత్యవసర పరిస్థితుల్లో వెంటనే 112కు సమాచారం అందించాలని, ఉత్సవాల సందర్భంగా పోలీసులతో సమన్వయం చేసుకుంటూ సహకరించాలని ఏసీపీ నరేష్ రెడ్డి, సీఐ ప్రశాంత్ నిర్వాహకులకు సూచించారు.
గణేష్ మండపాల ఇన్టిమేషన్ కోసం తెలంగాణ పోలీస్ పోర్టల్‌ను వినియోగించాలని పోలీసులు సూచించారు

https://policeportal.tspolice.gov.in/index.htm

షేర్ చేయండి