భద్రాచలం,సెప్టెంబర్ 7 (సమాచార హక్కు): ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ నిరుద్యోగులను మోసం చేసిన ఆరోపణలపై భద్రాచలం ఎమ్మెల్యే పీఏ కల్యాణ్ను పోలీసులు అరెస్ట్ చేశారు. భద్రాచలం వాసి రాయల శ్రీను ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
పోలీసుల వివరాల ప్రకారం.. ఉద్యోగాలు ఇప్పిస్తానని నమ్మించి పలువురు నిరుద్యోగుల నుంచి కల్యాణ్ భారీగా డబ్బులు వసూలు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. సుమారు రూ.8 కోట్ల వరకు వసూలు చేసినట్లు ఫిర్యాదులో పేర్కొన్నట్లు సమాచారం. ఇప్పటివరకు 54 మందిని మోసం చేసినట్లు ఆరోపణలు వెలువడ్డాయి.
అలాగే బెట్టింగ్కు అలవాటు పడి డబ్బులు పోగొట్టుకున్న తర్వాత ఉద్యోగాల పేరుతో డబ్బులు వసూలు చేసినట్లు కూడా ఆరోపణలు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారంపై పోలీసులు పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నారు.
ఉద్యోగాల పేరుతో మోసం.. భద్రాచలం ఎమ్మెల్యే పీఏ అరెస్ట్


