Friday, 16 October 2026
🔴 బ్రేకింగ్ న్యూస్
• అవినీతి విచారణ వివరాలను RTI కింద పూర్తిగా నిరాకరించలేరు: మద్రాస్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు • ప్రజాస్వామ్యానికి RTI చట్టం జీవనాడి: తెలంగాణ గవర్నర్ శివ ప్రతాప్ శుక్ల • RTIకి స్పందించని PIOకు రూ.20 వేల జరిమానా • RTI సమాచారంలో జాప్యం: మంచిర్యాల DEO, 18 మంది MEOలకు సమాచార కమిషన్ నోటీసులు • ఆర్టీఐ సమాచారంలో 5 ఏళ్లకు పైగా జాప్యం.. ఫరీదాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ ₹10 వేల పరిహారం చెల్లించాలని ఆదేశం • కర్ణాటక హైకోర్టు కీలక ఆదేశాలు.. RTI అధికారులపై జరిమానాల వివరాలు ఆన్‌లైన్‌లో పెట్టాలి • తమిళనాడులో RTI మినహాయింపు ఉత్తర్వు ఉపసంహరణ • అవినీతి విచారణ వివరాలను RTI కింద పూర్తిగా నిరాకరించలేరు: మద్రాస్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు • ప్రజాస్వామ్యానికి RTI చట్టం జీవనాడి: తెలంగాణ గవర్నర్ శివ ప్రతాప్ శుక్ల • RTIకి స్పందించని PIOకు రూ.20 వేల జరిమానా • RTI సమాచారంలో జాప్యం: మంచిర్యాల DEO, 18 మంది MEOలకు సమాచార కమిషన్ నోటీసులు • ఆర్టీఐ సమాచారంలో 5 ఏళ్లకు పైగా జాప్యం.. ఫరీదాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ ₹10 వేల పరిహారం చెల్లించాలని ఆదేశం • కర్ణాటక హైకోర్టు కీలక ఆదేశాలు.. RTI అధికారులపై జరిమానాల వివరాలు ఆన్‌లైన్‌లో పెట్టాలి • తమిళనాడులో RTI మినహాయింపు ఉత్తర్వు ఉపసంహరణ

కిలో ఉల్లిగడ్డలు 32 రూపాయలే: మంత్రి నాదెండ్ల మనోహర్

కిలో ఉల్లిగడ్డలు 32 రూపాయలే: మంత్రి నాదెండ్ల మనోహర్

ఆంధ్రప్రదేశ్‌లో నిత్యావసరాల ధరల పెరుగుదలతో ఇబ్బంది పడుతున్న సామాన్య ప్రజలకు కూటమి ప్రభుత్వం ఊరట కల్పించే దిశగా కీలక నిర్ణయం తీసుకుంది. వంటింటి భారాన్ని తగ్గించే లక్ష్యంతో, కిలో ఉల్లిపాయలను కేవలం రూ.32కే రాయితీపై అందించనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ మంగళవారం సోషల్ మీడియా ద్వారా వివరాలు వెల్లడించారు.

వచ్చే వారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా 115 రైతు బజార్లు, ప్రత్యేక మొబైల్ కౌంటర్ల ద్వారా ఈ రాయితీ ఉల్లిపాయల విక్రయాలు ప్రారంభమవుతాయని మంత్రి తెలిపారు. ఉల్లితో పాటు, చౌకధరల దుకాణాల (రేషన్ డిపోలు) ద్వారా రాయితీపై కందిపప్పు, పామాయిల్ కూడా అందుబాటులోకి తీసుకురానున్నట్లు ఆయన పేర్కొన్నారు.

బహిరంగ మార్కెట్ ధరలతో పోలిస్తే దాదాపు 30 శాతం తక్కువ ధరకే నాణ్యమైన సరుకులను ప్రజలకు అందించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు. ఈ కార్యక్రమానికి సహకారం అందిస్తున్న కేంద్ర ప్రభుత్వానికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ప్రభుత్వ తాజా నిర్ణయంతో సామాన్య, మధ్యతరగతి ప్రజలపై ఆర్థిక భారం గణనీయంగా తగ్గుతుందని భావిస్తున్నారు.

షేర్ చేయండి