Friday, 16 October 2026
🔴 బ్రేకింగ్ న్యూస్
• అవినీతి విచారణ వివరాలను RTI కింద పూర్తిగా నిరాకరించలేరు: మద్రాస్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు • ప్రజాస్వామ్యానికి RTI చట్టం జీవనాడి: తెలంగాణ గవర్నర్ శివ ప్రతాప్ శుక్ల • RTIకి స్పందించని PIOకు రూ.20 వేల జరిమానా • RTI సమాచారంలో జాప్యం: మంచిర్యాల DEO, 18 మంది MEOలకు సమాచార కమిషన్ నోటీసులు • ఆర్టీఐ సమాచారంలో 5 ఏళ్లకు పైగా జాప్యం.. ఫరీదాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ ₹10 వేల పరిహారం చెల్లించాలని ఆదేశం • కర్ణాటక హైకోర్టు కీలక ఆదేశాలు.. RTI అధికారులపై జరిమానాల వివరాలు ఆన్‌లైన్‌లో పెట్టాలి • తమిళనాడులో RTI మినహాయింపు ఉత్తర్వు ఉపసంహరణ • అవినీతి విచారణ వివరాలను RTI కింద పూర్తిగా నిరాకరించలేరు: మద్రాస్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు • ప్రజాస్వామ్యానికి RTI చట్టం జీవనాడి: తెలంగాణ గవర్నర్ శివ ప్రతాప్ శుక్ల • RTIకి స్పందించని PIOకు రూ.20 వేల జరిమానా • RTI సమాచారంలో జాప్యం: మంచిర్యాల DEO, 18 మంది MEOలకు సమాచార కమిషన్ నోటీసులు • ఆర్టీఐ సమాచారంలో 5 ఏళ్లకు పైగా జాప్యం.. ఫరీదాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ ₹10 వేల పరిహారం చెల్లించాలని ఆదేశం • కర్ణాటక హైకోర్టు కీలక ఆదేశాలు.. RTI అధికారులపై జరిమానాల వివరాలు ఆన్‌లైన్‌లో పెట్టాలి • తమిళనాడులో RTI మినహాయింపు ఉత్తర్వు ఉపసంహరణ

డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో కీలక పరిణామం

డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో కీలక పరిణామం
రాజమహేంద్రవరం, సెప్టెంబర్ 8 (సమాచార హక్కు):  రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దళిత యువకుడు, డ్రైవర్ వీధి సుబ్రహ్మణ్యం హత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో నిందితులుగా ఉన్న వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ అనంతబాబు, ఆయన భార్యకు సంబంధించిన కేసును రోజువారీగా విచారించాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.
హైకోర్టు ఆదేశాల మేరకు ఈ నెల 11వ తేదీ నుంచి రాజమహేంద్రవరం కోర్టులో కేసు విచారణ ప్రతిరోజూ కొనసాగనుంది. ఈ విషయాన్ని స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ముప్పాళ్ల సుబ్బారావు వెల్లడించారు. కేసు విచారణను వేగవంతం చేసి, సాక్షుల వాంగ్మూలాలు సహా తదుపరి న్యాయ ప్రక్రియను రోజువారీగా కొనసాగించనున్నారు.
2022 మేలో జరిగిన సుబ్రహ్మణ్యం మృతి కేసులో అనంతబాబుపై హత్య ఆరోపణలు నమోదయ్యాయి. అనంతరం కేసు దర్యాప్తులో పలు పరిణామాలు చోటుచేసుకున్నాయి. 2025లో ప్రత్యేక కోర్టు మరింత దర్యాప్తుకు అనుమతించడంతోపాటు, అదనపు చార్జిషీట్ దాఖలు చేయాలని ఆదేశించింది.
ఇదిలా ఉండగా, కేసులో సాక్షులను ప్రభావితం చేసేందుకు, బెదిరించేందుకు ప్రయత్నించారనే ఆరోపణలపై అనంతబాబును 2026 ఏప్రిల్‌లో పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం మే నెలలో రాజమహేంద్రవరం ప్రత్యేక న్యాయస్థానం ఆయన బెయిల్‌ను రద్దు చేసింది.
తాజాగా రోజువారీ విచారణకు ఆదేశాలు రావడంతో సుబ్రహ్మణ్యం హత్య కేసు మరోసారి ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ నెల 11 నుంచి రాజమహేంద్రవరం కోర్టులో జరిగే రోజువారీ విచారణలో కేసుకు సంబంధించిన కీలక అంశాలపై మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
షేర్ చేయండి