హైదరాబాద్,సెప్టెంబర్ 8 (సమాచార హక్కు): తెలంగాణ సచివాలయంలో విషాద ఘటన చోటుచేసుకుంది. ఇంధన శాఖ స్పెషల్ సీఎస్ నవీన్ మిట్టల్ వ్యక్తిగత కార్యదర్శిగా విధులు నిర్వహిస్తున్న రాజు ఆకస్మికంగా మృతి చెందారు.విధుల్లో ఉన్న సమయంలో రాజు ఒక్కసారిగా కుప్పకూలిపోయారు.
వెంటనే అక్కడున్న వారు స్పందించగా, మంత్రి వాకిటి శ్రీహరి సీపీఆర్ చేసి ఆయనను కాపాడేందుకు ప్రయత్నించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం ఆసుపత్రికి తరలించేందుకు ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకపోయింది.
రాజు ఆకస్మిక మృతితో సచివాలయ ఉద్యోగులు, అధికారులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. ఆయన మృతిపట్ల పలువురు సంతాపం వ్యక్తం చేశారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.