Saturday, 17 October 2026
🔴 బ్రేకింగ్ న్యూస్
• అవినీతి విచారణ వివరాలను RTI కింద పూర్తిగా నిరాకరించలేరు: మద్రాస్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు • ప్రజాస్వామ్యానికి RTI చట్టం జీవనాడి: తెలంగాణ గవర్నర్ శివ ప్రతాప్ శుక్ల • RTIకి స్పందించని PIOకు రూ.20 వేల జరిమానా • RTI సమాచారంలో జాప్యం: మంచిర్యాల DEO, 18 మంది MEOలకు సమాచార కమిషన్ నోటీసులు • ఆర్టీఐ సమాచారంలో 5 ఏళ్లకు పైగా జాప్యం.. ఫరీదాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ ₹10 వేల పరిహారం చెల్లించాలని ఆదేశం • కర్ణాటక హైకోర్టు కీలక ఆదేశాలు.. RTI అధికారులపై జరిమానాల వివరాలు ఆన్‌లైన్‌లో పెట్టాలి • తమిళనాడులో RTI మినహాయింపు ఉత్తర్వు ఉపసంహరణ • అవినీతి విచారణ వివరాలను RTI కింద పూర్తిగా నిరాకరించలేరు: మద్రాస్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు • ప్రజాస్వామ్యానికి RTI చట్టం జీవనాడి: తెలంగాణ గవర్నర్ శివ ప్రతాప్ శుక్ల • RTIకి స్పందించని PIOకు రూ.20 వేల జరిమానా • RTI సమాచారంలో జాప్యం: మంచిర్యాల DEO, 18 మంది MEOలకు సమాచార కమిషన్ నోటీసులు • ఆర్టీఐ సమాచారంలో 5 ఏళ్లకు పైగా జాప్యం.. ఫరీదాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ ₹10 వేల పరిహారం చెల్లించాలని ఆదేశం • కర్ణాటక హైకోర్టు కీలక ఆదేశాలు.. RTI అధికారులపై జరిమానాల వివరాలు ఆన్‌లైన్‌లో పెట్టాలి • తమిళనాడులో RTI మినహాయింపు ఉత్తర్వు ఉపసంహరణ

RTI ఫైళ్లు కనిపించకపోతే అధికారులపై కఠిన చర్యలు: కేరళ సమాచార కమిషనర్ టి.కె. రామకృష్ణన్

09 Sep 2026 · RTI
RTI ఫైళ్లు కనిపించకపోతే అధికారులపై కఠిన చర్యలు: కేరళ సమాచార కమిషనర్ టి.కె. రామకృష్ణన్
కోజికోడ్,సెప్టెంబర్ 9 (సమాచార హక్కు): సమాచార హక్కు చట్టం (RTI) కింద కోరిన సమాచారాన్ని అందించకుండా సంబంధిత ఫైళ్లు కనిపించడం లేదని, అందుబాటులో లేవని చెప్పే అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని కేరళ సమాచార కమిషనర్ టి.కె. రామకృష్ణన్ హెచ్చరించారు.
కోజికోడ్ జిల్లా కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో నిర్వహించిన విచారణ అనంతరం ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. RTI దరఖాస్తులకు సమాధానంగా ఫైలు కనిపించడం లేదని అధికారులు తరచూ చెబుతున్నారని, అయితే ప్రభుత్వ రికార్డులను సక్రమంగా నిర్వహించే బాధ్యత సంబంధిత ప్రజా అధికారులపైనే ఉంటుందని రామకృష్ణన్ స్పష్టం చేశారు.
ఒకవేళ ఏదైనా ఫైలు నిజంగా కనిపించకపోతే దానిపై చట్టపరమైన చర్యలు ప్రారంభించాలని ఆయన ఆదేశించారు. ప్రతి ఫైలుకు ఒక బాధ్యతాయుతమైన అధికారి (కస్టోడియన్) ఉండాలని, ఫైలు ఎవరి వద్ద నుంచి కనిపించకుండా పోయిందో గుర్తించి, బాధ్యులపై తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు.
RTI చట్టాన్ని అధికారులు సానుకూల దృక్పథంతో చూడాలని, చట్టంలో నిర్దేశించిన గడువులోగా ప్రజలు కోరిన సమాచారాన్ని అందించాలని కమిషనర్ సూచించారు.
ప్రజలు కోరే సమాచారాన్ని అందించడం ప్రభుత్వ అధికారుల బాధ్యత అని, ఫైళ్లు కనిపించడం లేదనే కారణంతో RTI చట్టం కింద సమాచారాన్ని నిరాకరించలేరనే విషయాన్ని ఈ సందర్భంగా కేరళ సమాచార కమిషన్ మరోసారి స్పష్టం చేసింది.
షేర్ చేయండి