Friday, 16 October 2026
🔴 బ్రేకింగ్ న్యూస్
• అవినీతి విచారణ వివరాలను RTI కింద పూర్తిగా నిరాకరించలేరు: మద్రాస్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు • ప్రజాస్వామ్యానికి RTI చట్టం జీవనాడి: తెలంగాణ గవర్నర్ శివ ప్రతాప్ శుక్ల • RTIకి స్పందించని PIOకు రూ.20 వేల జరిమానా • RTI సమాచారంలో జాప్యం: మంచిర్యాల DEO, 18 మంది MEOలకు సమాచార కమిషన్ నోటీసులు • ఆర్టీఐ సమాచారంలో 5 ఏళ్లకు పైగా జాప్యం.. ఫరీదాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ ₹10 వేల పరిహారం చెల్లించాలని ఆదేశం • కర్ణాటక హైకోర్టు కీలక ఆదేశాలు.. RTI అధికారులపై జరిమానాల వివరాలు ఆన్‌లైన్‌లో పెట్టాలి • తమిళనాడులో RTI మినహాయింపు ఉత్తర్వు ఉపసంహరణ • అవినీతి విచారణ వివరాలను RTI కింద పూర్తిగా నిరాకరించలేరు: మద్రాస్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు • ప్రజాస్వామ్యానికి RTI చట్టం జీవనాడి: తెలంగాణ గవర్నర్ శివ ప్రతాప్ శుక్ల • RTIకి స్పందించని PIOకు రూ.20 వేల జరిమానా • RTI సమాచారంలో జాప్యం: మంచిర్యాల DEO, 18 మంది MEOలకు సమాచార కమిషన్ నోటీసులు • ఆర్టీఐ సమాచారంలో 5 ఏళ్లకు పైగా జాప్యం.. ఫరీదాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ ₹10 వేల పరిహారం చెల్లించాలని ఆదేశం • కర్ణాటక హైకోర్టు కీలక ఆదేశాలు.. RTI అధికారులపై జరిమానాల వివరాలు ఆన్‌లైన్‌లో పెట్టాలి • తమిళనాడులో RTI మినహాయింపు ఉత్తర్వు ఉపసంహరణ

హైదరాబాద్‌లో నేటి నుంచి జాతీయ RTI సదస్సు

10 Sep 2026 · RTI
హైదరాబాద్‌లో నేటి నుంచి జాతీయ RTI సదస్సు

RTI అమలులో ఏకరూపత, పారదర్శకతపై రెండు రోజుల పాటు చర్చలు.

హైదరాబాద్,సెప్టెంబర్ 10 (సమాచార హక్కు) : సమాచార హక్కు చట్టం (RTI Act–2005) అమలులో మరింత ఏకరూపత, పారదర్శకత, సామర్థ్యం తీసుకురావడమే లక్ష్యంగా హైదరాబాద్‌లో గురువారం నుంచి రెండు రోజుల జాతీయ సదస్సు ప్రారంభం కానుంది. తెలంగాణ సమాచార కమిషన్ (TGIC) ఆధ్వర్యంలో ఈ నెల 10, 11 తేదీల్లో అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా (ASCI)లో ఈ సదస్సును నిర్వహిస్తున్నారు.

“Operational Uniformity in Implementation of RTI: Challenges and Solutions” అనే ప్రధాన అంశంపై సదస్సులో విస్తృతంగా చర్చలు జరగనున్నాయి. నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్స్ ఇన్ ఇండియా (NFICI) సదస్సుకు సహకరిస్తుండగా, ASCI భాగస్వామ్యంతో కార్యక్రమం నిర్వహిస్తున్నారు.

20 రాష్ట్రాల సమాచార కమిషనర్లు :

RTI దరఖాస్తులు, అప్పీళ్లు, ఫిర్యాదుల పరిష్కారంలో అనుసరించే విధానాల్లో ఏకరూపత తీసుకురావడం సదస్సులో ప్రధాన అంశంగా ఉండనుంది. సమాచార కమిషన్ల వద్ద పెండింగ్‌లో ఉన్న కేసులను తగ్గించడం, కేసులను వేగంగా పరిష్కరించడం, సమర్థవంతమైన విచారణ విధానాలను రూపొందించడం వంటి అంశాలపై చర్చించనున్నారు.

అయితే అన్ని కేసులను ఒకే విధానంలో యాంత్రికంగా పరిష్కరించకుండా, ప్రతి దరఖాస్తు, అప్పీల్, ఫిర్యాదును దాని ప్రత్యేక పరిస్థితులు, వాస్తవాలు, చట్టపరమైన నిబంధనల ఆధారంగా పరిశీలించాల్సిన అవసరాన్ని కూడా సదస్సు గుర్తించనుంది.

సెక్షన్ 4 అమలుపైనా చర్చ :

RTI చట్టంలోని సెక్షన్ 4 కింద ముందస్తు సమాచార వెల్లడి (Proactive Disclosure) ను మరింత సమర్థవంతంగా అమలు చేయడం, ప్రభుత్వ శాఖలు ప్రజలకు అవసరమైన సమాచారాన్ని స్వయంగా అందుబాటులో ఉంచే విధానాన్ని బలోపేతం చేయడం వంటి అంశాలపై కూడా చర్చలు జరగనున్నాయి.

అలాగే RTI ప్రక్రియలను డిజిటలైజ్ చేయడం, ప్రజలకు సమాచారాన్ని సులభంగా అందుబాటులోకి తీసుకురావడం, పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్లు (PIOలు), ఫస్ట్ అప్పిలేట్ అథారిటీలకు అవసరమైన శిక్షణ, సామర్థ్య పెంపు వంటి అంశాలు కూడా సదస్సులో చర్చకు రానున్నాయి.

సమాచార హక్కును పరిరక్షించడమే లక్ష్యం :

RTI చట్టాన్ని దుర్వినియోగం చేసే అవకాశాలను అరికడుతూనే, నిజమైన సమాచారాన్ని కోరే పౌరుల హక్కులను పరిరక్షించే విధానాలపై కూడా నిపుణులు చర్చించనున్నారు. సమాచార కమిషన్ల స్వతంత్రత, సమర్థతను మరింత బలోపేతం చేయడానికి తీసుకోవాల్సిన చర్యలపైనా అభిప్రాయాలను పంచుకోనున్నారు.

సదస్సు ద్వారా దేశంలోని వివిధ సమాచార కమిషన్లు అనుసరిస్తున్న ఉత్తమ విధానాలను పరస్పరం పంచుకుని, ప్రజలకు సమాచారాన్ని వేగంగా, పారదర్శకంగా అందించే వ్యవస్థను మరింత బలోపేతం చేయాలని నిర్వాహకులు భావిస్తున్నారు.

సమాచార హక్కు చట్టాన్ని మరింత సమర్థవంతంగా అమలు చేసి, ప్రజలకు ప్రభుత్వ సమాచారాన్ని సులభంగా అందుబాటులోకి తీసుకురావడంలో హైదరాబాద్‌లో జరుగుతున్న ఈ జాతీయ సదస్సు కీలక వేదికగా నిలవనుంది.

షేర్ చేయండి