Friday, 16 October 2026
🔴 బ్రేకింగ్ న్యూస్
• అవినీతి విచారణ వివరాలను RTI కింద పూర్తిగా నిరాకరించలేరు: మద్రాస్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు • ప్రజాస్వామ్యానికి RTI చట్టం జీవనాడి: తెలంగాణ గవర్నర్ శివ ప్రతాప్ శుక్ల • RTIకి స్పందించని PIOకు రూ.20 వేల జరిమానా • RTI సమాచారంలో జాప్యం: మంచిర్యాల DEO, 18 మంది MEOలకు సమాచార కమిషన్ నోటీసులు • ఆర్టీఐ సమాచారంలో 5 ఏళ్లకు పైగా జాప్యం.. ఫరీదాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ ₹10 వేల పరిహారం చెల్లించాలని ఆదేశం • కర్ణాటక హైకోర్టు కీలక ఆదేశాలు.. RTI అధికారులపై జరిమానాల వివరాలు ఆన్‌లైన్‌లో పెట్టాలి • తమిళనాడులో RTI మినహాయింపు ఉత్తర్వు ఉపసంహరణ • అవినీతి విచారణ వివరాలను RTI కింద పూర్తిగా నిరాకరించలేరు: మద్రాస్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు • ప్రజాస్వామ్యానికి RTI చట్టం జీవనాడి: తెలంగాణ గవర్నర్ శివ ప్రతాప్ శుక్ల • RTIకి స్పందించని PIOకు రూ.20 వేల జరిమానా • RTI సమాచారంలో జాప్యం: మంచిర్యాల DEO, 18 మంది MEOలకు సమాచార కమిషన్ నోటీసులు • ఆర్టీఐ సమాచారంలో 5 ఏళ్లకు పైగా జాప్యం.. ఫరీదాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ ₹10 వేల పరిహారం చెల్లించాలని ఆదేశం • కర్ణాటక హైకోర్టు కీలక ఆదేశాలు.. RTI అధికారులపై జరిమానాల వివరాలు ఆన్‌లైన్‌లో పెట్టాలి • తమిళనాడులో RTI మినహాయింపు ఉత్తర్వు ఉపసంహరణ

ప్రొటీన్ పౌడర్‌లో పురుగులు.. బిపాసా బసు ఆగ్రహం

11 Sep 2026 · జాతీయం
ప్రొటీన్ పౌడర్‌లో పురుగులు.. బిపాసా బసు ఆగ్రహం

ముంబై,సెప్టెంబర్ 11 (సమాచార హక్కు) : ప్రముఖ బాలీవుడ్ నటి బిపాసా బసుకు ఓ ప్రొటీన్ పౌడర్ విషయంలో చేదు అనుభవం ఎదురైంది. తాను ఉపయోగిస్తున్న ప్రొటీన్ పౌడర్ డబ్బాను తెరిచి చూడగా అందులో చిన్న చిన్న పురుగులు కనిపించాయని ఆమె తెలిపారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా వెల్లడించిన బిపాసా.. ఆహార ఉత్పత్తుల నాణ్యతపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.

ఈ ఘటనపై స్పందించిన ఆమె మహారాష్ట్ర ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (FDA) కమిషనర్ తుకారాం ముండేను ట్యాగ్ చేశారు. వినియోగదారుల ఆరోగ్యంతో ముడిపడిన అంశాల్లో నాణ్యతా ప్రమాణాలను కఠినంగా అమలు చేయాలని కోరారు.

“మనం కొనుగోలు చేసే వస్తువులు, పదార్థాలు అన్నీ కల్తీగానే ఉంటున్నాయి. వీటిని అరికట్టేది మీరే. మీరే మా చివరి ఆశ” అంటూ బిపాసా తన పోస్ట్‌లో పేర్కొన్నారు.

బిపాసా చేసిన ఫిర్యాదుతో ప్రొటీన్ పౌడర్ నాణ్యతపై ఇప్పుడు చర్చ మొదలైంది. ఈ వ్యవహారంపై అధికారులు ఉత్పత్తిని పరిశీలించి, నిబంధనల ప్రకారం చర్యలు తీసుకునే అవకాశం ఉంది. వినియోగించే ఆహార పదార్థాల విషయంలో అప్రమత్తంగా ఉండాల్సిన అవసరాన్ని ఈ ఘటన మరోసారి గుర్తుచేస్తోంది.

షేర్ చేయండి