Friday, 16 October 2026
🔴 బ్రేకింగ్ న్యూస్
• అవినీతి విచారణ వివరాలను RTI కింద పూర్తిగా నిరాకరించలేరు: మద్రాస్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు • ప్రజాస్వామ్యానికి RTI చట్టం జీవనాడి: తెలంగాణ గవర్నర్ శివ ప్రతాప్ శుక్ల • RTIకి స్పందించని PIOకు రూ.20 వేల జరిమానా • RTI సమాచారంలో జాప్యం: మంచిర్యాల DEO, 18 మంది MEOలకు సమాచార కమిషన్ నోటీసులు • ఆర్టీఐ సమాచారంలో 5 ఏళ్లకు పైగా జాప్యం.. ఫరీదాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ ₹10 వేల పరిహారం చెల్లించాలని ఆదేశం • కర్ణాటక హైకోర్టు కీలక ఆదేశాలు.. RTI అధికారులపై జరిమానాల వివరాలు ఆన్‌లైన్‌లో పెట్టాలి • తమిళనాడులో RTI మినహాయింపు ఉత్తర్వు ఉపసంహరణ • అవినీతి విచారణ వివరాలను RTI కింద పూర్తిగా నిరాకరించలేరు: మద్రాస్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు • ప్రజాస్వామ్యానికి RTI చట్టం జీవనాడి: తెలంగాణ గవర్నర్ శివ ప్రతాప్ శుక్ల • RTIకి స్పందించని PIOకు రూ.20 వేల జరిమానా • RTI సమాచారంలో జాప్యం: మంచిర్యాల DEO, 18 మంది MEOలకు సమాచార కమిషన్ నోటీసులు • ఆర్టీఐ సమాచారంలో 5 ఏళ్లకు పైగా జాప్యం.. ఫరీదాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ ₹10 వేల పరిహారం చెల్లించాలని ఆదేశం • కర్ణాటక హైకోర్టు కీలక ఆదేశాలు.. RTI అధికారులపై జరిమానాల వివరాలు ఆన్‌లైన్‌లో పెట్టాలి • తమిళనాడులో RTI మినహాయింపు ఉత్తర్వు ఉపసంహరణ

జన్‌ధన్ ఖాతాల్లో భారీగా నిష్క్రియ ఖాతాలు.. RTIలో కీలక వివరాలు

10 Sep 2026 · RTI
జన్‌ధన్ ఖాతాల్లో భారీగా నిష్క్రియ ఖాతాలు.. RTIలో కీలక వివరాలు
దేశంలో 59.03 కోట్ల జన్‌ధన్ ఖాతాలు ఉండగా 15.36 కోట్లు ఇనాపరేటివ్‌గా, 5.72 కోట్ల ఖాతాలు సున్నా బ్యాలెన్స్‌తో ఉన్నట్లు RTIలో వెల్లడైంది.
న్యూఢిల్లీ, సెప్టెంబర్ 10 (సమాచార హక్కు) : ప్రధానమంత్రి జన్‌ధన్‌ యోజనకు సంబంధించి సమాచార హక్కు చట్టం (RTI) ద్వారా కీలక వివరాలు వెలుగులోకి వచ్చాయి. 2026 ఆగస్టు 12 నాటికి దేశవ్యాప్తంగా 59.03 కోట్ల జన్‌ధన్‌ ఖాతాలు ఉండగా, వాటిలో 15.36 కోట్ల ఖాతాలు ఇనాపరేటివ్‌గా ఉన్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ వెల్లడించింది. మరో 5.72 కోట్ల ఖాతాల్లో సున్నా బ్యాలెన్స్‌ ఉన్నట్లు తెలిపింది.
ఈ మొత్తం ఖాతాల్లో రూ.3,15,179.90 కోట్లకు పైగా నిధులు ఉన్నట్లు RTI సమాధానంలో పేర్కొన్నారు. మహిళల పేర్లపై 32.89 కోట్ల ఖాతాలు, పురుషుల పేర్లపై 26.14 కోట్ల ఖాతాలు ఉన్నాయి.
రాష్ట్రాల విషయానికి వస్తే ఉత్తరప్రదేశ్‌ అత్యధిక జన్‌ధన్‌ ఖాతాలతో పాటు ఇనాపరేటివ్‌, సున్నా బ్యాలెన్స్‌ ఖాతాల్లోనూ మొదటి స్థానంలో ఉంది. యూపీలో 3.23 కోట్ల ఖాతాలు ఇనాపరేటివ్‌గా, 95.92 లక్షల ఖాతాల్లో సున్నా బ్యాలెన్స్‌ ఉన్నట్లు సమాచారం.
2014లో ఆర్థిక సేవలను అందరికీ చేరువ చేయాలనే లక్ష్యంతో జన్‌ధన్‌ యోజనను ప్రారంభించారు. అయితే కోట్లాది ఖాతాలు నిష్క్రియంగా ఉండటం, భారీ సంఖ్యలో ఖాతాల్లో సున్నా బ్యాలెన్స్‌ ఉండటం పథకం అమలు, ఖాతాల వినియోగంపై చర్చకు దారితీస్తోంది. సున్నా బ్యాలెన్స్‌ ఖాతా, ఇనాపరేటివ్‌ ఖాతా రెండూ ఒకటే కాదని అధికారులు స్పష్టం చేశారు.
షేర్ చేయండి