దుర్గగుడి ట్రస్ట్ బోర్డులో చిరంజీవి కుమార్తె సుస్మితకు చోటు
విజయవాడ,సెప్టెంబర్ 8 (సమాచార హక్కు): ప్రముఖ సినీ నటుడు చిరంజీవి పెద్ద కుమార్తె సుస్మిత కొణిదెలకు విజయవాడ శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం (దుర్గగుడి) ట్రస్ట్ బోర్డులో చోటు కల్పించారు. ఆమెను ట్రస్ట్ బోర్డుకు ప్రత్యేక ఆహ్వానితురాలిగా నియమిస్తూ దేవాదాయ శాఖ కార్యదర్శి కృష్ణబాబు ఉత్తర్వులు జారీ చేశారు.
ఆలయంలో జరిగే సమావేశాలు, ఇతర కార్యక్రమాలు, భక్తులకు సంబంధించిన సౌకర్యాలపై సూచనలు, సలహాలు అందించేందుకు సుస్మితకు అవకాశం కల్పించినట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. దేవస్థానం అభివృద్ధి, భక్తులకు మెరుగైన సౌకర్యాల కల్పనకు సంబంధించి ఆమె తన అభిప్రాయాలను వెల్లడించనున్నారు.
సుస్మిత కొణిదెలను దుర్గగుడి ట్రస్ట్ బోర్డుకు ప్రత్యేక ఆహ్వానితురాలిగా నియమించడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.