Saturday, 17 October 2026
🔴 బ్రేకింగ్ న్యూస్
• అవినీతి విచారణ వివరాలను RTI కింద పూర్తిగా నిరాకరించలేరు: మద్రాస్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు • ప్రజాస్వామ్యానికి RTI చట్టం జీవనాడి: తెలంగాణ గవర్నర్ శివ ప్రతాప్ శుక్ల • RTIకి స్పందించని PIOకు రూ.20 వేల జరిమానా • RTI సమాచారంలో జాప్యం: మంచిర్యాల DEO, 18 మంది MEOలకు సమాచార కమిషన్ నోటీసులు • ఆర్టీఐ సమాచారంలో 5 ఏళ్లకు పైగా జాప్యం.. ఫరీదాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ ₹10 వేల పరిహారం చెల్లించాలని ఆదేశం • కర్ణాటక హైకోర్టు కీలక ఆదేశాలు.. RTI అధికారులపై జరిమానాల వివరాలు ఆన్‌లైన్‌లో పెట్టాలి • తమిళనాడులో RTI మినహాయింపు ఉత్తర్వు ఉపసంహరణ • అవినీతి విచారణ వివరాలను RTI కింద పూర్తిగా నిరాకరించలేరు: మద్రాస్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు • ప్రజాస్వామ్యానికి RTI చట్టం జీవనాడి: తెలంగాణ గవర్నర్ శివ ప్రతాప్ శుక్ల • RTIకి స్పందించని PIOకు రూ.20 వేల జరిమానా • RTI సమాచారంలో జాప్యం: మంచిర్యాల DEO, 18 మంది MEOలకు సమాచార కమిషన్ నోటీసులు • ఆర్టీఐ సమాచారంలో 5 ఏళ్లకు పైగా జాప్యం.. ఫరీదాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ ₹10 వేల పరిహారం చెల్లించాలని ఆదేశం • కర్ణాటక హైకోర్టు కీలక ఆదేశాలు.. RTI అధికారులపై జరిమానాల వివరాలు ఆన్‌లైన్‌లో పెట్టాలి • తమిళనాడులో RTI మినహాయింపు ఉత్తర్వు ఉపసంహరణ

RTIతో వెలుగులోకి వచ్చిన కీలక వివరాలు.. పంజాబ్ యోగా కేంద్రాలపై రూ.76 కోట్ల ఖర్చు

14 Sep 2026 · RTI
RTIతో వెలుగులోకి వచ్చిన కీలక వివరాలు.. పంజాబ్ యోగా కేంద్రాలపై రూ.76 కోట్ల ఖర్చు

చండీగఢ్,సెప్టెంబర్ 14 (సమాచార హక్కు): పంజాబ్ ప్రభుత్వం నిర్వహిస్తున్న ‘CM Di Yogshala’ కార్యక్రమానికి సంబంధించి సమాచార హక్కు చట్టం (RTI) ద్వారా కీలక వివరాలు వెలుగులోకి వచ్చాయి. రాష్ట్రవ్యాప్తంగా వేలాది యోగా కేంద్రాల నిర్వహణకు ప్రభుత్వం భారీగా నిధులు ఖర్చు చేసినట్లు వెల్లడైంది.

RTI ద్వారా లభించిన వివరాల ప్రకారం రాష్ట్రంలో 10,953 యోగా కేంద్రాలు కొనసాగుతున్నాయి. వీటిలో 1,443 మంది యోగా శిక్షకులు సేవలందిస్తున్నారు. ఈ కేంద్రాల ద్వారా 3.23 లక్షల మందికి పైగా ప్రజలు యోగా శిక్షణ పొందుతున్నట్లు సమాచారం.

ఈ కార్యక్రమం కోసం గత మూడేళ్లలో ప్రభుత్వం సుమారు రూ.76 కోట్లు ఖర్చు చేసినట్లు RTI సమాధానంలో వెల్లడైంది. ప్రజలకు ఉచితంగా యోగా శిక్షణ అందించాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వం అమలు చేస్తోంది.

RTI ద్వారా బయటపడిన ఈ గణాంకాలు ప్రభుత్వ పథకాల అమలులో ప్రజాధనం ఎంత ఖర్చవుతోంది, ఎంతమంది ప్రజలకు ప్రయోజనం అందుతోంది అనే విషయాలను ప్రజలకు తెలియజేయడంలో సమాచార హక్కు చట్టం ప్రాధాన్యతను మరోసారి చూపిస్తున్నాయి.

షేర్ చేయండి