Friday, 16 October 2026
🔴 బ్రేకింగ్ న్యూస్
• అవినీతి విచారణ వివరాలను RTI కింద పూర్తిగా నిరాకరించలేరు: మద్రాస్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు • ప్రజాస్వామ్యానికి RTI చట్టం జీవనాడి: తెలంగాణ గవర్నర్ శివ ప్రతాప్ శుక్ల • RTIకి స్పందించని PIOకు రూ.20 వేల జరిమానా • RTI సమాచారంలో జాప్యం: మంచిర్యాల DEO, 18 మంది MEOలకు సమాచార కమిషన్ నోటీసులు • ఆర్టీఐ సమాచారంలో 5 ఏళ్లకు పైగా జాప్యం.. ఫరీదాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ ₹10 వేల పరిహారం చెల్లించాలని ఆదేశం • కర్ణాటక హైకోర్టు కీలక ఆదేశాలు.. RTI అధికారులపై జరిమానాల వివరాలు ఆన్‌లైన్‌లో పెట్టాలి • తమిళనాడులో RTI మినహాయింపు ఉత్తర్వు ఉపసంహరణ • అవినీతి విచారణ వివరాలను RTI కింద పూర్తిగా నిరాకరించలేరు: మద్రాస్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు • ప్రజాస్వామ్యానికి RTI చట్టం జీవనాడి: తెలంగాణ గవర్నర్ శివ ప్రతాప్ శుక్ల • RTIకి స్పందించని PIOకు రూ.20 వేల జరిమానా • RTI సమాచారంలో జాప్యం: మంచిర్యాల DEO, 18 మంది MEOలకు సమాచార కమిషన్ నోటీసులు • ఆర్టీఐ సమాచారంలో 5 ఏళ్లకు పైగా జాప్యం.. ఫరీదాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ ₹10 వేల పరిహారం చెల్లించాలని ఆదేశం • కర్ణాటక హైకోర్టు కీలక ఆదేశాలు.. RTI అధికారులపై జరిమానాల వివరాలు ఆన్‌లైన్‌లో పెట్టాలి • తమిళనాడులో RTI మినహాయింపు ఉత్తర్వు ఉపసంహరణ

బర్తరఫ్‌ అయిన ఉద్యోగికి RTI కింద విచారణ పత్రాలు ఇవ్వాలి: ఛత్తీస్‌గఢ్ హైకోర్టు

11 Sep 2026 · RTI
బర్తరఫ్‌ అయిన ఉద్యోగికి RTI కింద విచారణ పత్రాలు ఇవ్వాలి: ఛత్తీస్‌గఢ్ హైకోర్టు
బిలాస్‌పూర్,సెప్టెంబర్ 11 (సమాచార హక్కు): శాఖాపరమైన విచారణకు సంబంధించిన పత్రాలను సమాచార హక్కు చట్టం (RTI) కింద కోరిన బర్తరఫ్‌ అయిన ఉద్యోగికి ఆ సమాచారాన్ని అందించాలని ఛత్తీస్‌గఢ్ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. తనపై జరిగిన విచారణకు సంబంధించిన రికార్డులను తన రక్షణ కోసం కోరుతున్న వ్యక్తికి, కేవలం RTI చట్టంలోని మినహాయింపులను చూపిస్తూ సమాచారం నిరాకరించడం సమంజసం కాదని కోర్టు స్పష్టం చేసింది.
జంజ్‌గీర్-చాంపా ఫ్యామిలీ కోర్టులో డ్రైవర్‌గా పనిచేసిన అక్రమ్ ఖాన్‌పై పలు ఆరోపణలతో శాఖాపరమైన విచారణలు జరిగాయి. అనంతరం 2021 జనవరిలో ఆయన సేవలను రద్దు చేశారు. తనపై తీసుకున్న చర్యకు సంబంధించిన పత్రాలు, విచారణ రికార్డులు, నోట్‌షీట్లను RTI ద్వారా కోరగా అధికారులు సమాచారాన్ని నిరాకరించారు.
దీనిపై ఉద్యోగి అప్పీలు చేసినప్పటికీ ఫలితం లేకపోవడంతో హైకోర్టును ఆశ్రయించారు. ఈ కేసును విచారించిన హైకోర్టు.. ఉద్యోగి స్వయంగా ఎదుర్కొన్న శాఖాపరమైన విచారణకు సంబంధించిన సమాచారాన్ని తనను తాను సమర్థించుకునేందుకు కోరినప్పుడు, దాన్ని సాధారణంగా గోప్యత పేరుతో నిరాకరించలేమని పేర్కొంది.
మూడో వ్యక్తి వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగించే సమాచారం లేని సందర్భంలో RTI చట్టంలోని సెక్షన్ 8(1)(c), 8(1)(j) మినహాయింపులను వర్తింపజేయడం సరైంది కాదని కోర్టు తెలిపింది. సంబంధిత సమాచారాన్ని అవసరమైన రుసుము తీసుకుని ఉద్యోగికి అందించాలని ఆదేశించింది. ఈ తీర్పు శాఖాపరమైన విచారణలు, ఉద్యోగ తొలగింపులకు సంబంధించిన రికార్డులను RTI ద్వారా కోరే ఉద్యోగులకు ప్రాధాన్యమైనదిగా భావిస్తున్నారు.
షేర్ చేయండి