Friday, 16 October 2026
🔴 బ్రేకింగ్ న్యూస్
• అవినీతి విచారణ వివరాలను RTI కింద పూర్తిగా నిరాకరించలేరు: మద్రాస్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు • ప్రజాస్వామ్యానికి RTI చట్టం జీవనాడి: తెలంగాణ గవర్నర్ శివ ప్రతాప్ శుక్ల • RTIకి స్పందించని PIOకు రూ.20 వేల జరిమానా • RTI సమాచారంలో జాప్యం: మంచిర్యాల DEO, 18 మంది MEOలకు సమాచార కమిషన్ నోటీసులు • ఆర్టీఐ సమాచారంలో 5 ఏళ్లకు పైగా జాప్యం.. ఫరీదాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ ₹10 వేల పరిహారం చెల్లించాలని ఆదేశం • కర్ణాటక హైకోర్టు కీలక ఆదేశాలు.. RTI అధికారులపై జరిమానాల వివరాలు ఆన్‌లైన్‌లో పెట్టాలి • తమిళనాడులో RTI మినహాయింపు ఉత్తర్వు ఉపసంహరణ • అవినీతి విచారణ వివరాలను RTI కింద పూర్తిగా నిరాకరించలేరు: మద్రాస్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు • ప్రజాస్వామ్యానికి RTI చట్టం జీవనాడి: తెలంగాణ గవర్నర్ శివ ప్రతాప్ శుక్ల • RTIకి స్పందించని PIOకు రూ.20 వేల జరిమానా • RTI సమాచారంలో జాప్యం: మంచిర్యాల DEO, 18 మంది MEOలకు సమాచార కమిషన్ నోటీసులు • ఆర్టీఐ సమాచారంలో 5 ఏళ్లకు పైగా జాప్యం.. ఫరీదాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ ₹10 వేల పరిహారం చెల్లించాలని ఆదేశం • కర్ణాటక హైకోర్టు కీలక ఆదేశాలు.. RTI అధికారులపై జరిమానాల వివరాలు ఆన్‌లైన్‌లో పెట్టాలి • తమిళనాడులో RTI మినహాయింపు ఉత్తర్వు ఉపసంహరణ

ఐఫోన్‌ 18 ప్రో సిరీస్‌పై భారీ అంచనాలు.. ధర రూ.2 లక్షలు దాటనుందా?

ఐఫోన్‌ 18 ప్రో సిరీస్‌పై భారీ అంచనాలు.. ధర రూ.2 లక్షలు దాటనుందా?
హైదరాబాద్‌,సెప్టెంబర్ 8 (సమాచార హక్కు):యాపిల్‌ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఐఫోన్‌ 18 ప్రో సిరీస్‌పై టెక్‌ వర్గాల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఐఫోన్‌ 18 ప్రో, ఐఫోన్‌ 18 ప్రో మ్యాక్స్‌ మోడళ్లతో పాటు యాపిల్‌ తొలిసారిగా ఫోల్డబుల్‌ ఐఫోన్‌ను కూడా తీసుకురానుందనే ప్రచారం జరుగుతోంది. అయితే వీటిపై కంపెనీ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

ఐఫోన్‌ 18 ప్రో మ్యాక్స్‌ ప్రారంభ ధర రూ.1.55 లక్షల నుంచి రూ.1.60 లక్షల వరకు ఉండొచ్చని అంచనాలు వినిపిస్తున్నాయి. స్టోరేజ్‌ సామర్థ్యాన్ని బట్టి ధర మరింత పెరగనుంది. గతంలో వచ్చిన ఐఫోన్‌ 17 ప్రో మ్యాక్స్‌ 256GB వేరియంట్‌ ధర రూ.1.49 లక్షలుగా ఉండగా.. 512GB ధర రూ.1.69 లక్షలు, 1TB ధర రూ.1.89 లక్షలు, 2TB వేరియంట్‌ ధర రూ.2.29 లక్షలుగా ఉంది.

కొత్త 2nm చిప్‌తో ఐఫోన్‌ 18?

ఐఫోన్‌ 18 సిరీస్‌లో యాపిల్‌ కొత్త TSMC 2nm చిప్‌ టెక్నాలజీని ఉపయోగించనుందని సమాచారం. ఈ కొత్త చిప్‌తో పనితీరు, వేగం, విద్యుత్‌ సామర్థ్యంలో మరింత మెరుగుదల వచ్చే అవకాశం ఉందని టెక్‌ నిపుణులు భావిస్తున్నారు.

ఇక ఫోల్డబుల్‌ ఐఫోన్‌ విషయంలోనూ ఆసక్తికరమైన అంచనాలు ఉన్నాయి. యాపిల్‌ తీసుకురాబోయే ఈ ఫోల్డబుల్‌ మోడల్‌ ధర రూ.2 లక్షలు దాటే అవకాశం ఉందని టెక్‌ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అయితే ఈ ధర, ఫీచర్లు, విడుదల తేదీ వంటి అంశాలపై ప్రస్తుతం అధికారిక స్పష్టత లేదు.

మొత్తంగా.. కొత్త డిజైన్‌, మెరుగైన చిప్‌, అధునాతన ఫీచర్లతో ఐఫోన్‌ 18 ప్రో సిరీస్‌ ప్రీమియం స్మార్ట్‌ఫోన్‌ మార్కెట్‌లో మరింత సంచలనం సృష్టించే అవకాశం కనిపిస్తోంది.

షేర్ చేయండి