Friday, 16 October 2026
🔴 బ్రేకింగ్ న్యూస్
• అవినీతి విచారణ వివరాలను RTI కింద పూర్తిగా నిరాకరించలేరు: మద్రాస్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు • ప్రజాస్వామ్యానికి RTI చట్టం జీవనాడి: తెలంగాణ గవర్నర్ శివ ప్రతాప్ శుక్ల • RTIకి స్పందించని PIOకు రూ.20 వేల జరిమానా • RTI సమాచారంలో జాప్యం: మంచిర్యాల DEO, 18 మంది MEOలకు సమాచార కమిషన్ నోటీసులు • ఆర్టీఐ సమాచారంలో 5 ఏళ్లకు పైగా జాప్యం.. ఫరీదాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ ₹10 వేల పరిహారం చెల్లించాలని ఆదేశం • కర్ణాటక హైకోర్టు కీలక ఆదేశాలు.. RTI అధికారులపై జరిమానాల వివరాలు ఆన్‌లైన్‌లో పెట్టాలి • తమిళనాడులో RTI మినహాయింపు ఉత్తర్వు ఉపసంహరణ • అవినీతి విచారణ వివరాలను RTI కింద పూర్తిగా నిరాకరించలేరు: మద్రాస్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు • ప్రజాస్వామ్యానికి RTI చట్టం జీవనాడి: తెలంగాణ గవర్నర్ శివ ప్రతాప్ శుక్ల • RTIకి స్పందించని PIOకు రూ.20 వేల జరిమానా • RTI సమాచారంలో జాప్యం: మంచిర్యాల DEO, 18 మంది MEOలకు సమాచార కమిషన్ నోటీసులు • ఆర్టీఐ సమాచారంలో 5 ఏళ్లకు పైగా జాప్యం.. ఫరీదాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ ₹10 వేల పరిహారం చెల్లించాలని ఆదేశం • కర్ణాటక హైకోర్టు కీలక ఆదేశాలు.. RTI అధికారులపై జరిమానాల వివరాలు ఆన్‌లైన్‌లో పెట్టాలి • తమిళనాడులో RTI మినహాయింపు ఉత్తర్వు ఉపసంహరణ

కేరళలో నారా లోకేశ్.. అమృతపురిలో ‘అమ్మ’ ఆశీర్వాదం

కేరళలో నారా లోకేశ్.. అమృతపురిలో ‘అమ్మ’ ఆశీర్వాదం

ఆంధ్రప్రదేశ్ ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ శుక్రవారం కేరళలో పర్యటించారు. కొల్లం జిల్లాలోని ప్రఖ్యాత ఆధ్యాత్మిక కేంద్రమైన మాతా అమృతానందమయి (అమ్మ) ఆశ్రమాన్ని ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా అమ్మను దర్శించుకుని ఆమె ఆశీస్సులు అందుకున్నారు. ఇది పూర్తిగా లోకేశ్ వ్యక్తిగత పర్యటన అని, అధికారిక కార్యక్రమం కాదని తెలుస్తోంది.

అమృతపురిగా ప్రసిద్ధి చెందిన ఈ ఆశ్రమంలో లోకేశ్ దాదాపు మూడు గంటల పాటు గడిపారు. ఆశ్రమ ప్రాంగణంలో ఉన్న కాళీమాత ఆలయాన్ని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అమ్మను కలుసుకుని ఆశీర్వాదం పొందారు. ఆశ్రమంలోని గజరాజులకు పండ్లు అందించారు. ఈ పర్యటన తనకు ఎంతో ఆధ్యాత్మిక సంతృప్తినిచ్చిందని లోకేశ్ పేర్కొన్నారు. తన పర్యటనకు సంబంధించిన వివరాలను ఆయన తన ఎక్స్ ఖాతాలో పంచుకున్నారు.

ఈ ఆధ్యాత్మిక పర్యటనలో భాగంగా లోకేశ్ అక్కడి విద్యాసంస్థలను కూడా పరిశీలించారు. ఆశ్రమం ఆధ్వర్యంలో నడుస్తున్న అమృత విశ్వ విద్యాపీఠంతో పాటు, అమృత ఆయుర్వేద కళాశాలను ఆయన సందర్శించారు. అక్కడి విద్యాబోధన, మౌలిక సదుపాయాల గురించి సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. ఏపీ విద్యాశాఖ మంత్రిగా ఆయన విద్యాపీఠాన్ని సందర్శించడం ప్రాధాన్యత సంతరించుకుంది.

షేర్ చేయండి