Friday, 16 October 2026
🔴 బ్రేకింగ్ న్యూస్
• అవినీతి విచారణ వివరాలను RTI కింద పూర్తిగా నిరాకరించలేరు: మద్రాస్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు • ప్రజాస్వామ్యానికి RTI చట్టం జీవనాడి: తెలంగాణ గవర్నర్ శివ ప్రతాప్ శుక్ల • RTIకి స్పందించని PIOకు రూ.20 వేల జరిమానా • RTI సమాచారంలో జాప్యం: మంచిర్యాల DEO, 18 మంది MEOలకు సమాచార కమిషన్ నోటీసులు • ఆర్టీఐ సమాచారంలో 5 ఏళ్లకు పైగా జాప్యం.. ఫరీదాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ ₹10 వేల పరిహారం చెల్లించాలని ఆదేశం • కర్ణాటక హైకోర్టు కీలక ఆదేశాలు.. RTI అధికారులపై జరిమానాల వివరాలు ఆన్‌లైన్‌లో పెట్టాలి • తమిళనాడులో RTI మినహాయింపు ఉత్తర్వు ఉపసంహరణ • అవినీతి విచారణ వివరాలను RTI కింద పూర్తిగా నిరాకరించలేరు: మద్రాస్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు • ప్రజాస్వామ్యానికి RTI చట్టం జీవనాడి: తెలంగాణ గవర్నర్ శివ ప్రతాప్ శుక్ల • RTIకి స్పందించని PIOకు రూ.20 వేల జరిమానా • RTI సమాచారంలో జాప్యం: మంచిర్యాల DEO, 18 మంది MEOలకు సమాచార కమిషన్ నోటీసులు • ఆర్టీఐ సమాచారంలో 5 ఏళ్లకు పైగా జాప్యం.. ఫరీదాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ ₹10 వేల పరిహారం చెల్లించాలని ఆదేశం • కర్ణాటక హైకోర్టు కీలక ఆదేశాలు.. RTI అధికారులపై జరిమానాల వివరాలు ఆన్‌లైన్‌లో పెట్టాలి • తమిళనాడులో RTI మినహాయింపు ఉత్తర్వు ఉపసంహరణ

నేపాల్‌లో మరో జల ప్రళయం.. మ‌రో హై అలర్ట్ జారీ

నేపాల్‌లో మరో జల ప్రళయం.. మ‌రో హై అలర్ట్ జారీ
ఇటీవలే హిమానీనదం విస్ఫోటనం కారణంగా తీవ్ర సంక్షోభంలో చిక్కుకున్న నేపాల్‌ను మరో ముప్పు భయపెడుతోంది. భోటే కోశి నదిలో నీటి ప్రవాహం ఆకస్మికంగా పెరగడంతో జాతీయ విపత్తు అవాయ‌ తగ్గింపు, నిర్వహణ అథారిటీ (ఎన్‌డీఆర్ఆర్ఎంఏ) నేడు తీవ్ర వరద హెచ్చరికలు జారీ చేసింది. నదీ పరివాహక ప్రాంతాల్లోని ప్రజలు, స్థానిక అధికారులు అత్యంత అప్రమత్తంగా ఉండాలని, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందుజాగ్రత్త చర్యలు తీసుకోవాలని సూచించింది.

టిబెట్ సరిహద్దు సమీపంలో హిమాలయాల్లో హిమానీనదం కూలిపోవడంతో అనేక గ్రామాలు ధ్వంసమై, భారీ వరదలు సంభవించిన విషయం తెలిసిందే. ఈ పెను విషాదం నుంచి కోలుకోకముందే ఇప్పుడు భోటే కోశి నది నుంచి మరో ప్రమాదం పొంచి ఉంది.

“భోటే కోశి నదిలో వరద ప్రవాహం పెరిగిన శబ్దాలు వినిపించినట్టు రసువా జిల్లా పరిపాలన కార్యాలయానికి సమాచారం అందింది” అని ఎన్‌డీఆర్ఆర్ఎంఏ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘ఎక్స్‌’లో ఒక పోస్ట్ ద్వారా వెల్లడించింది. ఈ సమాచారం మేరకు రసువా, నువాకోట్, ధాదింగ్ జిల్లాల అధికారులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరింది. నది చుట్టుపక్కల ప్రాంతాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, తదుపరి సమాచారం అందిన వెంటనే మరిన్ని వివరాలు అందిస్తామని తెలిపింది.

కొద్దిసేపటికే ఎన్‌డీఆర్ఆర్ఎంఏ మరో పోస్ట్ చేసింది. భోటే కోశిలో వరద ప్రవాహం మరింత పెరిగినట్లు నివేదికలు అందుతున్నాయని, అందువల్ల సహాయక చర్యల్లో పాల్గొంటున్న సిబ్బంది అత్యంత జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించింది. “రసువాలోని భోటే కోశి నదిలో వరద ప్రవాహం మరింత పెరిగినట్లు తెలుస్తోంది. కాబట్టి రసువా, నువాకోట్, ధాదింగ్, చిత్వాన్ సహా ప్రభావిత ప్రాంతాలలో సహాయ, పునరావాస కార్యక్రమాలలో నిమగ్నమైన సిబ్బంది, నదీ తీర ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి” అని విజ్ఞప్తి చేసింది. ఈ ఆకస్మిక పరిణామంతో నేపాల్ అధికార యంత్రాంగం ఉలిక్కిపడింది. సహాయక బృందాలను అప్రమత్తం చేస్తూ, నష్టం జరగకుండాచర్యలు ముమ్మరం చేసింది

షేర్ చేయండి