Friday, 16 October 2026
🔴 బ్రేకింగ్ న్యూస్
• అవినీతి విచారణ వివరాలను RTI కింద పూర్తిగా నిరాకరించలేరు: మద్రాస్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు • ప్రజాస్వామ్యానికి RTI చట్టం జీవనాడి: తెలంగాణ గవర్నర్ శివ ప్రతాప్ శుక్ల • RTIకి స్పందించని PIOకు రూ.20 వేల జరిమానా • RTI సమాచారంలో జాప్యం: మంచిర్యాల DEO, 18 మంది MEOలకు సమాచార కమిషన్ నోటీసులు • ఆర్టీఐ సమాచారంలో 5 ఏళ్లకు పైగా జాప్యం.. ఫరీదాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ ₹10 వేల పరిహారం చెల్లించాలని ఆదేశం • కర్ణాటక హైకోర్టు కీలక ఆదేశాలు.. RTI అధికారులపై జరిమానాల వివరాలు ఆన్‌లైన్‌లో పెట్టాలి • తమిళనాడులో RTI మినహాయింపు ఉత్తర్వు ఉపసంహరణ • అవినీతి విచారణ వివరాలను RTI కింద పూర్తిగా నిరాకరించలేరు: మద్రాస్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు • ప్రజాస్వామ్యానికి RTI చట్టం జీవనాడి: తెలంగాణ గవర్నర్ శివ ప్రతాప్ శుక్ల • RTIకి స్పందించని PIOకు రూ.20 వేల జరిమానా • RTI సమాచారంలో జాప్యం: మంచిర్యాల DEO, 18 మంది MEOలకు సమాచార కమిషన్ నోటీసులు • ఆర్టీఐ సమాచారంలో 5 ఏళ్లకు పైగా జాప్యం.. ఫరీదాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ ₹10 వేల పరిహారం చెల్లించాలని ఆదేశం • కర్ణాటక హైకోర్టు కీలక ఆదేశాలు.. RTI అధికారులపై జరిమానాల వివరాలు ఆన్‌లైన్‌లో పెట్టాలి • తమిళనాడులో RTI మినహాయింపు ఉత్తర్వు ఉపసంహరణ

పారిశ్రామికవేత్తపై సంచలన ఆరోపణలు.. అరెస్ట్

31 Aug 2026 · క్రైమ్
పారిశ్రామికవేత్తపై సంచలన ఆరోపణలు.. అరెస్ట్
చెన్నై: బాలికలను వ్యభిచారంలోకి దింపి, వారితో లైంగిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారనే ఆరోపణలపై ఓ ప్రముఖ పారిశ్రామికవేత్తను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ వ్యవహారానికి సంబంధించి మరికొందరిని కూడా అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. పోలీసుల వివరాల ప్రకారం.. గతేడాది ఓ సామాజిక కార్యకర్తకు గుర్తుతెలియని వ్యక్తి పెన్‌డ్రైవ్ అందజేశారు. అందులో ప్రముఖ పారిశ్రామికవేత్త వీరమణి ఓ బాలికతో లైంగిక కార్యకలాపాలకు పాల్పడుతున్న దృశ్యాలు ఉన్నట్లు ఆరోపించారు. దీంతో ఆయన పోలీసులను ఆశ్రయించడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. దర్యాప్తులో భాగంగా తేనాంపేటలోని ఓ ఇంటిని వీరమణి అద్దెకు తీసుకున్నట్లు పోలీసులు గుర్తించారు. ఆ ఇంటి నిర్వహణ బాధ్యతలను శాంతి, ఆమె భర్త మహేంద్ర సింగ్‌లకు అప్పగించినట్లు తేలింది. వారి ద్వారా పలువురు బాలికలను అక్కడికి తీసుకువచ్చి వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. అనంతరం శాంతి, మహేంద్ర సింగ్ నివాసాలు, కార్యాలయాల్లో పోలీసులు సోదాలు నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు బాలికలు, మహిళలకు సంబంధించిన ఫోన్లు, ఇతర కీలక ఆధారాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఈ కేసులో శాంతి, మహేంద్ర సింగ్‌తో పాటు పారిశ్రామికవేత్త వీరమణిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. వ్యభిచార వ్యవహారం వెనుక ఇంకా ఎవరెవరి ప్రమేయం ఉందన్న కోణంలో దర్యాప్తు కొనసాగుతోంది.
షేర్ చేయండి