Friday, 16 October 2026
🔴 బ్రేకింగ్ న్యూస్
• అవినీతి విచారణ వివరాలను RTI కింద పూర్తిగా నిరాకరించలేరు: మద్రాస్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు • ప్రజాస్వామ్యానికి RTI చట్టం జీవనాడి: తెలంగాణ గవర్నర్ శివ ప్రతాప్ శుక్ల • RTIకి స్పందించని PIOకు రూ.20 వేల జరిమానా • RTI సమాచారంలో జాప్యం: మంచిర్యాల DEO, 18 మంది MEOలకు సమాచార కమిషన్ నోటీసులు • ఆర్టీఐ సమాచారంలో 5 ఏళ్లకు పైగా జాప్యం.. ఫరీదాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ ₹10 వేల పరిహారం చెల్లించాలని ఆదేశం • కర్ణాటక హైకోర్టు కీలక ఆదేశాలు.. RTI అధికారులపై జరిమానాల వివరాలు ఆన్‌లైన్‌లో పెట్టాలి • తమిళనాడులో RTI మినహాయింపు ఉత్తర్వు ఉపసంహరణ • అవినీతి విచారణ వివరాలను RTI కింద పూర్తిగా నిరాకరించలేరు: మద్రాస్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు • ప్రజాస్వామ్యానికి RTI చట్టం జీవనాడి: తెలంగాణ గవర్నర్ శివ ప్రతాప్ శుక్ల • RTIకి స్పందించని PIOకు రూ.20 వేల జరిమానా • RTI సమాచారంలో జాప్యం: మంచిర్యాల DEO, 18 మంది MEOలకు సమాచార కమిషన్ నోటీసులు • ఆర్టీఐ సమాచారంలో 5 ఏళ్లకు పైగా జాప్యం.. ఫరీదాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ ₹10 వేల పరిహారం చెల్లించాలని ఆదేశం • కర్ణాటక హైకోర్టు కీలక ఆదేశాలు.. RTI అధికారులపై జరిమానాల వివరాలు ఆన్‌లైన్‌లో పెట్టాలి • తమిళనాడులో RTI మినహాయింపు ఉత్తర్వు ఉపసంహరణ

మత్తు రహిత భారత్ కోసం యువత ముందుకు రావాలి: ప్రధాని మోదీ

30 Aug 2026 · జాతీయం
మత్తు రహిత భారత్ కోసం యువత ముందుకు రావాలి: ప్రధాని మోదీ
న్యూఢిల్లీ: దేశాన్ని మత్తు రహిత భారతంగా తీర్చిదిద్దేందుకు యువత కీలక పాత్ర పోషించాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ‘మన్ కీ బాత్’ 137వ ఎపిసోడ్‌లో మాదకద్రవ్యాల వ్యసనంతో కలిగే దుష్ప్రభావాలను ప్రస్తావించిన ఆయన.. డ్రగ్స్‌కు దూరంగా ఉండేలా యువతలో అవగాహన పెంచాల్సిన అవసరం ఉందన్నారు.
మాదకద్రవ్యాల వ్యసనం ఒక్క వ్యక్తి జీవితాన్నే కాకుండా కుటుంబం, సమాజాన్ని కూడా ప్రభావితం చేస్తుందని ప్రధాని అన్నారు. యువ సంగీతకారులు పాటల ద్వారా, విద్యార్థులు నాటికల ద్వారా, కంటెంట్‌ క్రియేటర్లు సోషల్‌ మీడియా ద్వారా మత్తు వ్యతిరేక సందేశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు.
మహిళా సాధికారతకు పీఎం స్వనిధి అండ
మహిళల ఆర్థిక సాధికారతలో పీఎం స్వనిధి యోజన కీలకంగా మారుతోందని ప్రధాని మోదీ తెలిపారు. దేశవ్యాప్తంగా వీధి వ్యాపారాలు నిర్వహిస్తున్న మహిళలకు ఈ పథకం ఆర్థికంగా అండగా నిలుస్తోందన్నారు. పీఎం స్వనిధి లబ్ధిదారుల్లో సుమారు 46 శాతం మంది మహిళలేనని, దాదాపు 35 లక్షల మంది మహిళలు ఈ పథకం ద్వారా తమ వ్యాపారాలను అభివృద్ధి చేసుకుంటున్నారని తెలిపారు.
గాజియాబాద్‌కు చెందిన బబితా శర్మ, బెంగళూరుకు చెందిన టి.ఎస్. నింగమ్మ విజయగాథలను ప్రధాని ఈ సందర్భంగా ప్రస్తావించారు. ఆర్థిక సహకారం అందడంతో వారు తమ చిన్న వ్యాపారాలను విస్తరించుకున్నారని చెప్పారు. ఒక మహిళ ఆర్థికంగా ఎదిగితే దాని ప్రభావం మొత్తం కుటుంబ భవిష్యత్తుపై ఉంటుందని మోదీ పేర్కొన్నారు.
పరిశుభ్రతతో ప్రాంతాల రూపురేఖల్లో మార్పు
ప్రజలు పరిశుభ్రతను తమ బాధ్యతగా స్వీకరిస్తే పరిసరాలు శుభ్రపడటంతో పాటు ఆయా ప్రాంతాల రూపురేఖలు, గుర్తింపు కూడా మారుతాయని ప్రధాని అన్నారు. దేశవ్యాప్తంగా స్వచ్ఛత కోసం ప్రజలు చేస్తున్న ప్రయత్నాలు స్ఫూర్తిదాయకంగా ఉన్నాయని తెలిపారు.
చిన్న శౌఖ్యం.. పెద్ద విజయానికి మార్గం
చిన్ననాటి నుంచి ఉన్న ఆసక్తిని కష్టపడి అభివృద్ధి చేసుకుంటే అది ఉపాధికి, విజయానికి మార్గంగా మారుతుందని మోదీ అన్నారు. నాగాలాండ్‌కు చెందిన యువతి వేసాలూ పురో పూల సాగును శౌఖ్యంగా ప్రారంభించి, శాస్త్రీయ పద్ధతులతో అభివృద్ధి చేసి విజయవంతమైన వ్యాపారంగా మార్చుకున్న విషయాన్ని ఆయన ప్రస్తావించారు. స్థానిక మార్కెట్‌ను దాటి ఆమె పండించిన పూలు ఢిల్లీ, ముంబై వంటి నగరాలకు చేరుతున్నాయని తెలిపారు.
మత్తు రహిత భారత నిర్మాణం, మహిళా సాధికారత, పరిశుభ్రతతో పాటు యువతలో ప్రతిభను ప్రోత్సహించడం ద్వారా దేశ అభివృద్ధిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు.
షేర్ చేయండి