Friday, 16 October 2026
🔴 బ్రేకింగ్ న్యూస్
• అవినీతి విచారణ వివరాలను RTI కింద పూర్తిగా నిరాకరించలేరు: మద్రాస్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు • ప్రజాస్వామ్యానికి RTI చట్టం జీవనాడి: తెలంగాణ గవర్నర్ శివ ప్రతాప్ శుక్ల • RTIకి స్పందించని PIOకు రూ.20 వేల జరిమానా • RTI సమాచారంలో జాప్యం: మంచిర్యాల DEO, 18 మంది MEOలకు సమాచార కమిషన్ నోటీసులు • ఆర్టీఐ సమాచారంలో 5 ఏళ్లకు పైగా జాప్యం.. ఫరీదాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ ₹10 వేల పరిహారం చెల్లించాలని ఆదేశం • కర్ణాటక హైకోర్టు కీలక ఆదేశాలు.. RTI అధికారులపై జరిమానాల వివరాలు ఆన్‌లైన్‌లో పెట్టాలి • తమిళనాడులో RTI మినహాయింపు ఉత్తర్వు ఉపసంహరణ • అవినీతి విచారణ వివరాలను RTI కింద పూర్తిగా నిరాకరించలేరు: మద్రాస్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు • ప్రజాస్వామ్యానికి RTI చట్టం జీవనాడి: తెలంగాణ గవర్నర్ శివ ప్రతాప్ శుక్ల • RTIకి స్పందించని PIOకు రూ.20 వేల జరిమానా • RTI సమాచారంలో జాప్యం: మంచిర్యాల DEO, 18 మంది MEOలకు సమాచార కమిషన్ నోటీసులు • ఆర్టీఐ సమాచారంలో 5 ఏళ్లకు పైగా జాప్యం.. ఫరీదాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ ₹10 వేల పరిహారం చెల్లించాలని ఆదేశం • కర్ణాటక హైకోర్టు కీలక ఆదేశాలు.. RTI అధికారులపై జరిమానాల వివరాలు ఆన్‌లైన్‌లో పెట్టాలి • తమిళనాడులో RTI మినహాయింపు ఉత్తర్వు ఉపసంహరణ

మోక్షజ్ఞ సినీ ఎంట్రీ ఖరారు.. మైత్రీ మూవీ మేకర్స్‌తో వశిష్ఠ కాంబినేషన్

07 Sep 2026 · సినిమా
మోక్షజ్ఞ సినీ ఎంట్రీ ఖరారు.. మైత్రీ మూవీ మేకర్స్‌తో వశిష్ఠ కాంబినేషన్
హైదరాబాద్: నందమూరి బాలకృష్ణ తనయుడు నందమూరి మోక్షజ్ఞ తేజ సినీ రంగ ప్రవేశం ఎట్టకేలకు ఖరారైంది. మోక్షజ్ఞ పుట్టినరోజు సందర్భంగా ఆయన తొలి చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ అధికారికంగా ప్రకటించింది.
దర్శకుడు వశిష్ఠ మల్లిడి ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. ‘బింబిసార’తో గుర్తింపు తెచ్చుకున్న వశిష్ఠ సిద్ధం చేసిన కథకు మోక్షజ్ఞ ఓకే చెప్పినట్లు సమాచారం. మైత్రీ మూవీ మేకర్స్‌ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు.
బాలకృష్ణ ఆశీస్సులతో మోక్షజ్ఞ హీరోగా కొత్త ప్రయాణం ప్రారంభం కానుండటంతో నందమూరి అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. మోక్షజ్ఞ, బాలకృష్ణ, వశిష్ఠలతో పాటు చిత్రబృందం కలిసి ఉన్న ఫొటోలను మేకర్స్ విడుదల చేశారు. ఈ సినిమా త్వరలోనే సెట్స్‌పైకి వెళ్లనున్నట్లు ప్రకటించారు.
ఈ చిత్రానికి ‘సింబా’ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నట్లు సమాచారం. అయితే టైటిల్‌తో పాటు హీరోయిన్, ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను మేకర్స్ త్వరలో వెల్లడించనున్నారు.
షేర్ చేయండి