Friday, 16 October 2026
🔴 బ్రేకింగ్ న్యూస్
• అవినీతి విచారణ వివరాలను RTI కింద పూర్తిగా నిరాకరించలేరు: మద్రాస్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు • ప్రజాస్వామ్యానికి RTI చట్టం జీవనాడి: తెలంగాణ గవర్నర్ శివ ప్రతాప్ శుక్ల • RTIకి స్పందించని PIOకు రూ.20 వేల జరిమానా • RTI సమాచారంలో జాప్యం: మంచిర్యాల DEO, 18 మంది MEOలకు సమాచార కమిషన్ నోటీసులు • ఆర్టీఐ సమాచారంలో 5 ఏళ్లకు పైగా జాప్యం.. ఫరీదాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ ₹10 వేల పరిహారం చెల్లించాలని ఆదేశం • కర్ణాటక హైకోర్టు కీలక ఆదేశాలు.. RTI అధికారులపై జరిమానాల వివరాలు ఆన్‌లైన్‌లో పెట్టాలి • తమిళనాడులో RTI మినహాయింపు ఉత్తర్వు ఉపసంహరణ • అవినీతి విచారణ వివరాలను RTI కింద పూర్తిగా నిరాకరించలేరు: మద్రాస్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు • ప్రజాస్వామ్యానికి RTI చట్టం జీవనాడి: తెలంగాణ గవర్నర్ శివ ప్రతాప్ శుక్ల • RTIకి స్పందించని PIOకు రూ.20 వేల జరిమానా • RTI సమాచారంలో జాప్యం: మంచిర్యాల DEO, 18 మంది MEOలకు సమాచార కమిషన్ నోటీసులు • ఆర్టీఐ సమాచారంలో 5 ఏళ్లకు పైగా జాప్యం.. ఫరీదాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ ₹10 వేల పరిహారం చెల్లించాలని ఆదేశం • కర్ణాటక హైకోర్టు కీలక ఆదేశాలు.. RTI అధికారులపై జరిమానాల వివరాలు ఆన్‌లైన్‌లో పెట్టాలి • తమిళనాడులో RTI మినహాయింపు ఉత్తర్వు ఉపసంహరణ

రాజమహేంద్రవరం పేపర్‌ మిల్లును పరిశీలించిన పురందేశ్వరి

రాజమహేంద్రవరం పేపర్‌ మిల్లును పరిశీలించిన పురందేశ్వరి
రాజమహేంద్రవరం: పేపర్‌ మిల్లును ఉద్దేశించి ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి ప్రశ్నించారు. పేపర్‌ మిల్లు నుంచి పన్ను బకాయిలు, జరిమానా ఎలా రాబట్టాలో ఆ మంత్రికి (పవన్‌ కల్యాణ్‌) బాగా తెలుసని వ్యాఖ్యానించారు. కాలుష్యంపై పేపర్‌ మిల్లు యాజమాన్యం పట్టించుకోవడం లేదని, పరిశ్రమలు ఏర్పాటు చేసి నిబంధనలు ఉల్లంఘిస్తామంటే కుదరదని పేర్కొన్నారు.
నగరంలోని బీజేపీ కార్యాలయంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు పి. నాగేంద్ర అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో ఎమ్మెల్సీ సోము వీర్రాజుతో కలిసి ఆమె మాట్లాడారు.
బీజేపీపై ప్రజలకు నమ్మకముందని, క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేసేందుకు రాజమహేంద్రవరం అర్బన్‌లోని పలు ప్రాంతాల్లో పార్టీ పతాకాన్ని మంగళవారం ఒకే సమయంలో ఆవిష్కరిస్తామని తెలిపారు. కంబాలచెరువు వద్ద భారీ బహిరంగ సభ ఉంటుందని చెప్పారు.
ఈ నెల 17న మోదీ పుట్టినరోజు సందర్భంగా సేవా కార్యక్రమాలు ప్రారంభించి, వచ్చే నెల 17 వరకు కొనసాగించాలని నిర్ణయించామని వెల్లడించారు. కూటమి పార్టీలు సమన్వయంతో స్థానిక ఎన్నికలకు ముందుకెళ్లాలని, ఇప్పటికే సీఎం చంద్రబాబు మూడు పార్టీల ముఖ్య నాయకులతో సమావేశం నిర్వహించారని పురందేశ్వరి తెలిపారు.
రాజమహేంద్రవరం కార్పొరేషన్‌ బీజేపీ అధ్యక్షుడితో ఉన్నత ప్రచార కార్యక్రమాలపై కూడా ఆమె మాట్లాడారు.

షేర్ చేయండి